వైసీపీ పాలనలో నష్టపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషిచేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. అమరావతిలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. గురువారం నాడు అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ప్రజా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పుడు మనం ఆనందంగా స్వాతంత్య్రం జరుపుకుంటున్నామంటే పూర్వం ఎందరో పెద్దల ప్రాణ త్యాగ ఫలితమేనని అన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగడానికి వారి పాత్ర ఎంతో ఉందని చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.