భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. కువైట్లో పర్యటించనున్నారు. ఆగస్టు 18న కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాను కలుస్తారని, అలాగే కువైట్ నాయకులతో భేటీ అవుతారని భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇరు దేశాల మధ్య రాజకీయ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, సాంస్కృతిక, కాన్సులర్, ప్రజల మధ్య సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతార్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని పేర్కొంది.