ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అయితే జెండా ఎగురవేసిన అనంతరం వేదికపైకి వచ్చిన పవణ్‌కల్యాణ్..తన కూతురు ఆద్య కొణిదెలతో కలిసి సెల్ఫీ దిగారు. తన తండ్రి సెల్ఫీ తీస్తుండగా.. ఆద్య క్యూట్‌గా ఫోజు ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.