పేదరికంలో ఉన్న క్షత్రియుల అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం తోడ్పాటునివ్వాలని క్షత్రియ నాయకులు కోరారు. అసెంబ్లీలో క్షత్రియ కులానికి చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంతోమంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు క్షత్రియ సామాజిక వర్గాల్లోనూ ఉన్నారని, వలస జీవులుగా ఉన్న అనేకమంది పేదలకు కార్పొరేషన్‌తో భరోసా లభిస్తుందని వారు సీఎం చంద్రబాబుకు విన్నవిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. విధివిధానాలు పరిశీలించి కత్రియ కార్పొరేషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈబీసీ నుంచి విద్యార్థులకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు ఎస్.వి.ఎస్.ఎస్.వర్మ, దాట్ల సుబ్బరాజు, శాసనమండలి సభ్యులు సత్యనారాయణ రాజు, రవికిరణ్ వర్మ తదితరులు ఉన్నారు.