చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన పెన్షన్ల పెంపు, ఉచితవిద్యుత్ 100 యూనిట్లు నుంచి 150 పెంపు, నూలు పై రాయిటింపెంపు, చేనేత సొసైటీల త్రిఫ్ట్ ఫండ్ పెంపు, చేనేత కార్మికుల వ్యక్తి గత రుణాలు, గ్రూపు రుణాలు మాఫీ చేయడంపై చేనేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చీరాల నుంచి శాసనమండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత, కర్నూలు జిల్లా నుండి ఎంపీ శ్రీ నిమ్మల కిష్టప్ప, గుంటూరు జిల్లా మంగళగిరి నుండి శ్రీ గంజి చిరంజీవి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు బుధవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిశారు.ముఖ్యమంత్రి ప్రకటించిన రాయితీలు ,పెన్షన్స్ పెంపు పై హర్షం వ్యక్తం చేస్తూ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ప్రత్యేకంగా తయారుచేసిన వస్త్రాలను ముఖ్యమంత్రి కి బహూకరించారు.