శ్రీహరి కోటలో ఇస్రోకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్-6ను మోసుకెళ్లే ఎల్వీఎం3-ఎం6 వ్యోమనౌక బుధవారం ఉదయం 8.54 గంటలకు నింగిలోకి ఎగరనుంది. సుమారు 6,500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని స్పేస్‌పోర్ట్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్, అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఈ వాణిజ్య ప్రయోగాన్ని నిర్వహిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa