పేద ప్రజలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్ లను స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేయటం జరిగింది.ఈరోజు గుడివాడ పట్టణం ఏజీకే స్కూల్ సెంటర్ లో టిడిపి రాష్ట్ర నాయకుడు కొనకల్ల బుల్లయ్య గారు మరియు ఎన్డీఏ పార్టీల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు రిబ్బన్ కట్ చేసి రెండవ అన్న క్యాంటీన్ ప్రారంభించటం జరిగింది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి గారు, టిడిపి నాయకులు ప్రజలకు అల్పాహారం వడ్డించటం జరిగింది. అనంతరం టోకెన్లు కొనుక్కొని ఎన్డీఏ కూటమి నాయకులు అన్న క్యాంటీన్ లో అల్పాహారాన్ని రుచి చూడటం జరిగింది.గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లను రద్దు చేసిందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు గారు ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది. మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పటం జరిగింది.రాజకీయాలకు అతీతంగా పేదలకు మంచి జరిగే కార్యక్రమాలు ఎవరు చేపట్టిన దాన్ని రద్దు చేయకుండా కొనసాగించాలనీ, లేకుంటే జగన్ మాదిరి చరిత్ర హీనులుగా మిగిలిపోతారనీ ఎన్డీఏ కూటమీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం గారు, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గారు, మున్సిపల్ డి.ఈ ప్రవీణ్ గారు, బిజెపి నాయకులు అంగడాల సతీష్ గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్ గారు, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గొర్జీ సత్యనారాయణ గారు, లింగం ప్రసాద్ గారు పలువురు టిడిపి - జనసేన - బిజెపి పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బందులు పాల్గొనటం జరిగింది.