అనంతపురం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి ప్యాక్ కంప్యూటరైజేషన్ ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి ఆదేశించారు. శుక్రవారం అనంతపురం రూరల్ మండలంలోని రాచానపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.