ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా సమస్యలపై గళం ఎత్తిన గళ్ళా మాధవి.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 03:31 PM

గుంటూరు కార్పొరేషన్ లో కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పలు ప్రజా సమస్యలపై గళమెత్తి అధికారుల తీరును నిరసించారు. ప్రధానంగా నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్ లలో ప్రజా సమస్యలపై మరియు అభివృద్ధి పై చర్చలు జరుగుతుంటే గుంటూరు కార్పొరేషన్ లో మాత్రం పారిశుధ్యం గురించి ప్రస్తావన చేయటం బాధాకరంగా ఉన్నదని, అధికారుల తీరు మాత్రం ఆక్షేపనీయమన్నారు.ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అయిన అమరావతిలో భాగయ్యిన గుంటూరు నగరంలో చెత్త, పారిశుద్ధ్య నిర్వహణ మాత్రం దారుణం. కనీసం ఇంటి వద్ద చెత్త కూడా ఎత్తలేని పరిస్థితిలో మున్సిపల్ అధికారులు ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నాను ప్రధానంగా నాకు చెత్త సమస్య అధికంగా కనబడింది. దీని గురించి అధికారులను వద్ద ప్రస్తావన చేయగా సరైన సిబ్బంది, యంత్రాలు లేవని సాకుగా చెప్పారు తప్ప దానికి సరైన పరిష్కార దిశగా అధికారులు ఎందుకు ముందడుగు వేయలేదు. నియోజకవర్గంలో మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని అదేవిధంగా పలు సమస్యల గురించి అధికారులను పరిష్కరించమని కోరితే "చేస్తాము చూస్తాము" అని సమాధానం ఇస్తున్నారు. తప్ప ఎప్పటి లోగా చేస్తామని చెప్పటం లేదు. చిన్న సమస్యల పరిష్కారం కోసం ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ప్రయోజనాలు లేవు.అనేక డివిజన్లో చెత్త వేయడానికి కూడా బిన్లు లేవు. అలాగే కాలువలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించడానికి అనేక కారణాలు చెబుతున్నారు.ఇలా ప్రతి సమస్యకు కారణాలు చెబితే పరిష్కారం దొరకదు కాబట్టి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకొని పారిశుధ్యన్ని మెరుగుపరచాలని కోరుతున్నాను. అదేవిధంగా పలు డివిజన్లలో స్ట్రీట్ లైట్ ల విషయంలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వీధి దీపాలను పాడైపోయిన వాటిలో కొత్తవి పెట్టమని కోరిన కూడా అవి కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉన్నారు.నగరంలో ఇళ్ల మధ్యన మున్సిపల్, ప్రైవేట్ స్థలాల్లో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి, చిట్టడవులను తలపిస్తున్నాయి. ఇందులో విషసర్పాలు చేరి ప్రజలకు హాని గురిచేస్తున్నాయి. అని నా దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది.నా దృష్టికి వచ్చిన కొన్నిచోట్ల వీటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కావున మీరు ప్రైవేట్ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలి కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇవి డంపింగ్ యార్డ్ మాదిరిగా తయారవుతాయని మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa