ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 12:11 PM

న్యూఢిల్లీ : దేశంలో కోటి మంది యువతకు పీఎం కౌషల్ వికాస్ యోజన కింద శిక్షణ నివ్వనున్నట్లు తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయెల్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో ఆయన రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఇప్పటి వరకూ 35 వేల కోట్లు చెల్లించామన్నారు. దేశ వ్యాప్తంగా 7 ప్రాంతాలలో  కృత్రిమ ఇంటెలిజెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే సైనికులకు ప్రత్యేక అలవెన్సులు ప్రకటించారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆరోగ్య పథకం ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రవేశపెట్టామని పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ఈ పథకం ద్వారా 50 కోట్ల మంది పేదలకు ఉచిత వైద్యం లభిస్తుందని ఆయన చెప్పారు. కొత్తగా పలు రాష్ట్రాలకు ఎయిమ్స్‌ మంజూరు చేశామని ఆయన అన్నారు.


-అంగన్‌వాడీ సిబ్బంది వేతనం 50 శాతం పెంపు
-ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోయిన వారి రుణాల రీషెడ్యూలింగ్
-రీ షెడ్యూల్ చేసిన రుణాలపై 2 శాతం వడ్డీ తగ్గింపు
-ఆవుల సంరక్షణకు ప్రత్యేక పథకం-కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణాలు
-రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రాయితీలు-గ్రామీణులకు కొత్తగా 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
- కార్మిక ప్రమాద బీమా రూ.లక్షన్నర నుంచి రూ. 6 లక్షలకు పెంపు* గ్రాట్యుటీ పరిధి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు
-ముద్ర స్కీం కింద రుణాలకు రూ. 7 లక్షల కోట్లు
- 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగం కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్
- అసంఘటిత కార్మికులు పెన్షన్ కోసం రూ.60 జమ చేయాల్సి ఉంటుంది
-ఈఎస్‌ఐ  పరిమితి రూ.15 వేల నుంచి 21 వేలకు పెంపు
- రూ.15 వేల నెల జీతం వుండే వేతన జీవులకు కొత్త పథకం
- ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరుతో కొత్త స్కీమ్
- నెలకు రూ. 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి రూ.75 వేల కోట్లు
-పాడి, మత్స్య రైతులకు 2 శాతం వడ్డీకే రుణం
- కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తాం
- పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
- 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి
- 2018 డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమం అమలు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa