ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం పట్టణంలోని రథాలపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫంక్షన్హాలులో నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ తెలిపారు. సదరు కార్యక్రమానికి జిల్లాస్థాయి, డివిజన్, నియోజకవర్గ స్థాయిల అధికారులందరూ హాజరవుతారని తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజలనుంచి వచ్చే అర్జీలను స్వీకరిస్తారని తెలియజేశారు.