దగ్గరిదారి అయితే చాలు.. నిబంధనల సంగతి తర్వాత అన్నట్లు కొందరు అడ్డగోలుగా వాహనాలను నడుపుతున్నారు. యూటర్న్ తీసుకునేందుకు నాలుగైదు కి.మీ. ప్రయాణించే బదులు.. రాంగ్ రూట్లో కిలోమీటర్ ప్రయాణిస్తే త్వరగా గమ్యం చేరుకోవచ్చనే ఆలోచనతో వ్యతిరేక దిశలో, అదీ వేగంతో వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల్లో వేగంగా ప్రయాణించేవారు.. ఇలా ఎదురొచ్చే వాహనాలను గుర్తించి బ్రేక్ వేసేలోగానే జరగాల్సిన ఘోరం జరిగిపోతోంది.