నెలకు ఒకసారైనా వాషింగ్ మెషీన్లు శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. వాషింగ్ మెషీన్‌కు సరఫరా అయ్యే నీరు వేడిగా ఉంటేనే అందులోని ఈ-కొలీ బ్యాక్టీరియా చనిపోతుంది. డిటర్జెంట్ డ్రాయర్, రబ్బర్ రింగ్‌ను కూడా శుభ్రం చేయాలి. వాషింగ్ మెషీన్ల క్లీనింగ్‌కు ప్రత్యేక డిటర్జెంట్ ఉంటుంది. ఖాళీ వాషింగ్ మెషీన్‌లో అది వేసి 'క్లీన్ టబ్' బటన్ నొక్కాలి.