ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11.45 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి వెళ్తారు. 12 గంటలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీపై రివ్యూ చేస్తారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.