కోల్‌కత్తాలో జూనియర్ డాక్టరుపై జరిగిన హత్యాచారంపై బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని కర్నూలు ఐద్వా సీనియర్ నాయకురాలు నిర్మలమ్మ, జిల్లా కార్యదర్శి అలివేలమ్మ, ఎస్ ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, జూనియర్ డాక్టర్ల అసోసియేషన నాయకులు భార్గవ్, అఖిల్ డిమాండ్ చేశారు. సోమవారం కేవీఆర్ కాలేజీ నుంచి రాజ్‌విహార్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కోల్‌కత్తాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశం మొత్తం ఆందోళనలు జరుగుతుంటే మమతా బెనర్జీ వ్యవహారం నిందితులకు సహకరించేలాగా ఉందన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ టౌన కార్యదర్శి సాయి, ఐద్వా నాయకు రాలు మాలన, వేణమ్మ, అమర్, ఆర్యన, మనోహర్, యోగి పాల్గొన్నారు. కోల్‌కత్తాలో జూనియర్ డాక్టర్‌ను హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐసా రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, జిల్లా కార్యదర్శి నాగార్జున డిమాండ్ చేశారు. ఐసా ఆధ్వర్యంలో సోమవారం బిర్లాగేటు ఆవరణలో జూనియర్ డాక్టర్ ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రంగస్వామి, నగర కార్య దర్శి పెద్దయ్య పాల్గొన్నారు.