ఢిల్లీలో కానిస్టిట్యూషన్ క్లబ్ లో బీజేపీయేతర పక్షాల సమావేశం ప్రారంభమైంది. సేవ్ ది నేషన్-సేవ్ డెమోక్రసీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, గులాం నబీ ఆజాద్, డేరాక్ ఓబ్రెయిన్, కనిమొళి, శరద్ యాదవ్, శరద్ పవర్, ఆంటోనీ, అహ్మద్ పటేల్, రాంగోపాల్ యాదవ్, కోదండరాం తదితరులంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఈవీఎంల పనితీరు, వ్యక్తమవుతున్న అనుమానాలు , బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేయాల్సిన ర్యాలీలు, కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చజరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa