ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హోంశాఖపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని వివరించారు. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసులు 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134 శాతం పెరిగాయని వివరించారు. గంజాయి, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైంకు అడ్డుకట్ట వేయాలని, టెక్నాలజీ వాడకం, పోలీసు శాఖ బలోపేతం వంటి అంశాలపై రివ్యూలో చర్చించారు.