నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం మంగళవారం నాటికి 589.40 అడుగులు ఉంది. ఇది 310.25 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 8144 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7518, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,150, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ఎల్‌ఎల్‌సీ ద్వారా 600, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 47,212 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 47,212 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.