వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత లోకేశ్ జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీ పెట్టామని తన హోటల్ మూయించారని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన ప్రకాశ్ బాబు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆమె ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అశోక్‌బాబుతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మాస్క్ పెట్టుకోలేదన్న సాకు చూపించి తనపై తప్పుడు కేసులు కూడా వైసీపీ నేతలు పెట్టించారని, తనకు న్యాయం చేయాలని ప్రకాశ్ బాబు మంత్రికి విజ్ఞప్తి చేశారు.