ఎస్‌సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ వ్యతిరేఖ పోరాట సమితి ఆధ్వర్యంలో కృష్ణ జిల్లా మచిలీపట్నంలో దళిత సంఘ నాయకులు భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి మచిలీపట్నం బస్ స్టాండ్ నుంచి బస్‌లు కదలకుండా నిలిపివేశారు. అయితే ఎలాంటి లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బస్ స్టాండ్ ఎదుట భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. వర్గీకరణ జరిగితే దళితుల్లో ఐకమత్యం పోతుందని, ఉద్యోగాల్లో దళితులకు అన్యాయం జరుగుతుందని దళిత సంఘాల నాయకులు చెప్పారు. సుప్రీంకోర్ట్ ఈ అంశంపై పునరాలోచన చేయాలని కోరుతున్నామని వారు తెలిపారు.