గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో బుధవారం ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ జరిగింది. జోనల్ సూపర్వైజర్ నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దురదృష్టవశాత్తు ఎయిడ్స్ వచ్చిన వారిపట్ల ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధికి ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తుందని వివరించారు. సిబ్బంది ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.