సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతోందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. ప్రజల బాగోగులు గాలికి వదిలేసి ఆయనపై అభాండాలు వేస్తోందని ఆరోపించారు. రూ.3.63 కోట్లతో ఎగ్పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారని, బాబుకు చిత్తశుద్ధి ఉంటే లెక్కలన్నీ బయటపెట్టాలని సవాల్ విసిరారు. దుష్ప్రచారంపై కాదు.. హామీల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.