తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ఎంపీడీఓ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ప్రజాసేవలో గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సామజిక న్యాయంకోసం పాటుపడుతూ యస్సీ, యస్టీ,మైనార్టీ, బలహీన పేదలకు విశ్వనాధ్ చేస్తున్నసేవలను గుర్తించి ఆండ్రూస్ థియసోఫికల్ యునివర్సీటీ (USA) ప్రతినిధులు న్యూడిల్లీ, వైయంసిఏ ఆడిటోరియంలో జరిగిన నేషనల్ ఇండిపెండంట్ బిషప్ కౌన్సిల్ సదస్సుల ఈ పురస్కారం అందించారు. సమాజ సేవలో గతంలో ట్రూ ఇండియన్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయ పురష్కారం, ప్రజాబంధు పురస్కారం అందుకున్న యంపిడిఓ విశ్వనాథ్ మాజీ సైనికుడు. గ్రూప్-I అధికారిగా తూర్పుగోదావరిజిల్లాలో వివిధ మండలంలో నిస్వార్ద సేవలందించడం జరిగింది. వివక్షకు గురవుతున్న వర్గాల తరుపున అనేక ఉద్యమాలు చేసి ఆంధ్రప్రదేశ్ అనేక సంస్కరణలకు కేంద్రబి0దువయ్యారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇస్తున్న సామాజిక బద్రతా పించన్ పథకానికి యన్టీఆర్ భరోసా నామకరణం చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్నారు. గొల్లప్రోలు ఎంపీడీఓగా పనిచేస్తున్నసమయంలో చేబ్రోలు గ్రామంలో యస్సీలు యుగాలుగా త్రాగునీటి సమస్యతో బాధపడుతున్న విషయాన్ని విశ్వనాధ్ గుర్తించి త్రాగునీరుబోరు వేయించి శాశ్వతంగా నీటి సమస్యను దూరం చేసి ప్రజల మన్ననలు పొందారు. అలాగే గ్రంధాలయాలు లేని గ్రామాలలో పంచాయతీనిధుల ఖర్చుతో దినపత్రికలను యస్సీ, యస్టీ ఆవాసాలలో చదువుకుంటున్న యువతు లకు అందుబాటులోకి తెచ్చారు. మహిళలను సంఘటితం చేసి మద్యపాన రహిత ఉద్యమం నడపడమే కాక ‘బెల్ట్ షాపులను’శాస్వతంగా మూయించారు. గిరిజన ఆవాసాలలో విద్యుదీకరణ చేయడంలో విశ్వనాథ్ ఎనలేని కృషిచేసారు. తూర్పుగోదావరి జిల్లాలో తాను పని చేసిన మండల ప్రజా పరిషద్ ప్రభుత్వ కార్యాలయాలలో జ్యోతిరావు ఫూలే, డా. అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి సమాజంలో అసమానతలు తొలగాలని సామాజిక ఉద్యమాలు చేసారు. రంపచోడవరం గిరిజనఏజెన్సీ ప్రాంతం యం. బూరుగుబంధ గ్రామంలోని కోయదొరల త్రాగునీటి సమస్య తీర్చార్చి గిరిజనుల మన్ననలు పొందారు. చేనేతసమస్యలపై పోరుబాట పట్టి వర్షాకాలంలో వృత్తి కోల్పోతున్న నేతన్నలకు నేతబృతి ఇప్పించడంలో ముఖ్యంగా చేనేత కార్పొరేషన్ ఏర్పాటు లోవిశేష కృషి చేసారు. ప్రస్థుతం విశ్వనాథ్ పలు ఉద్యోగ, ప్రజా సంఘాలలో చురుకైన పాత్ర పోషిస్తూ యస్సీ, యస్టీ, దివ్యాంగ ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడుగా, ఆ ఆ ఫౌండేషన్ సలహాదారుడిగా, బీసీ ఉద్యోగుల సంక్షేమసంఘం ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ఎంపీడీఓ సంఘం కన్వీనరుగా, బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులుగా, క్షేత్రస్థాయి సహాయకులు, సాంకేతికసంఘం గౌరవ అధ్యక్షుడుగా, ఆంద్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ప్రధాన కార్యధర్శిగా, రాష్ట్ర బీసి జనసభ కార్యధర్శిగా చాల సంఘాలలో విశ్వనాధ్ తనదైన పాత్ర పోషిస్తూ ఎన్నో సేవలు అందిస్తున్నారు. విశ్వనాధ్ సేవలను గుర్తించి అమెరికాలోని ‘దాన’అనే అంతర్జాతీయ స్వచ్చంధ సంస్థ 2015లో “వారియర్ అఫ్ ది పూర్” పురష్కారంతో గౌరవిస్తే ఇప్పడు ఆండ్రూస్ యూనివర్సీటీ వారు ప్రజాసేవలో గౌరవ డాక్టరేట్ పపుర పురష్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో జాతీయ మైనారిటీ వైస్ చైర్మన్ జార్జి కురియన్, నిబ్ చైర్మైన్ మార్టిన్, వివిధ రాష్ట్రల నుంచి వచ్చిన ప్రతినిధులు విశ్వనాథ్ సేవలను కొనియాడారు…
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa