గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి యత్నించిన కేసులో వరుసగా నోటీసులు అందుకుంటున్న నేపథ్యంలో వైసీపీ నేత జోగి రమేష్ బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన పోలీస్ విచారణ అనంతరం సర్కిల్ కార్యాలయం నుంచి జోగి రమేశ్ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు. మీడియాతో సైతం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ రోజు జరిగిన పోలీస్ విచారణకు తన తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, విజయవాడ నగరానికి చెందిన వైసీీపీ నేత పి. గౌతంరెడ్డితో కలిసి జోగి రమేశ్ మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు. తన న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట జోగి రమేశ్... తన వాదనలు వినిపిస్తున్నారు.