అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలడంపై చంద్రబాబు, వాసంశెట్టి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.