ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్యుతాపురం ఘటనపై సుందరపు విజయ్ కుమార్ దిగ్భ్రాంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 11:47 PM

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని రియాక్టర్ పేలిన ఘటనపై ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో ఫోన్‍లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో పలువురు చనిపోవడం బాధాకరం అని ఎమ్మెల్యే అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాద సందర్భంగా ఎన్డీఆప్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, శరీర భాగాల కోసం రెస్యూ టీమ్స్ వెతుకుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com