ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన జడ్జిగా హేమ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బార్ అసోసియేషన్ రఘు రామ్, గురురాజా రావ్ మరియు సీనియర్ న్యాయవాదులు ఆధ్వర్యంలో నూతన జడ్జికి స్వాగతం పలికారు. ముందుగా న్యాయవాదులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. నూతన జడ్జి మాట్లాడుతూ కక్షిదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మల్లికార్జున, మురళీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.