ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 22, 2024, 02:28 PM

అచ్యుతాపురం సెజ్‌ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి ₹50లక్షలు ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా గాయపడిన వారికి ₹25లక్షలు ఇస్తామన్నారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం వారి కుటుంబీకులతో ఆయన మాట్లాడారు. వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. కాగా మృతుల కుటుంబాలకు ₹కోటి చొప్పున ఇస్తామని కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే.అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో సంభవించిన భారీ పేలుడు కర్మికుల జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు18 మంది మృత దేహాలను వెలికి తీశారు. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఏసెనిషియల్ ఫార్మా లో సాల్వెంట్ లీకై ఎలక్ట్రికల్ ప్యానల్ పై పడటంతో భారీ ప్రమాదం సంభవించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com