పంచాయతీల అభివృద్ధి కోసం సర్పంచ్ల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 988 కోట్లు జమచేయడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెఆర్డీ మంత్రి లోకేష్‌కు చాంబర్ తరపున అభినందనలు తెలియజేశారు. జలజీవన్ కింద ఇంటింటికి కొలాయి పథకం కింద మరో రూ.500 కోట్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేశారు చేశారన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీ సభ్యుల గౌరవ వేతనం పెంచాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. 36 పనులను గ్రామాల్లో చేసుకునేలా ఈ నెల 23న గ్రామ సభలను పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానం చేయాలని నిర్ణయించి రూ.2,000 కోట్లు విడుదల చేశారన్నారు. పంచాయతీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేర్చుతున్నారని తెలిపారు. పంచాయతీల నిధులను రూ.10,600 కోట్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉపాధి నిధులను దారి మళ్లాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై ఎన్నో ఉద్యమాలు చేశామని వైవీబీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.