శ్రీకాకుళం జిల్లా, లావేరు పరిధిలోని గుర్రాలపాలెంలో బుధవారం పాముకాటుకు గురై బి.వరలక్ష్మి(60) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. వరలక్ష్మి బుధవారం ఉదయం తన పంట పొలంలో వేసిన సరుగుడి తోటకు గొప్పుతవ్వేందుకు వెళ్లగా పాము కాటు గురై సృహతప్పి పడిపోయింది. తర్వాత వెళ్లిన మిగతా కూలీలు ఆమెను చూసి ఊళ్లోవా రికి సమాచారం అందించారు. వెంటనే గ్రామస్థులు 108 వాహనం సహాయంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందనట్టు వైద్యులు ధ్రువీకరించారు. వరలక్ష్మికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు.