అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం తరుఫున విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. కేజీహెచ్‌లో మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను కలెక్టర్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని.. భాదితులకు అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.