అక్టోబర్4న ధ్వజారోహణతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 8వ తేదీన గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. ధ్వజరోహణ సందర్భంగా ధ్వజస్తంభంపై గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. వేద పండితులు మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీశాఖ 2 వారాల ముందునుంచే కసరత్తు చేస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి.