ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్కు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అంతేకాదు.. ఆయనకు ఏకంగా పార్టీ అనుబంధ విభాగాల (25 విభాగాలు) పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.