కలకత్తాలో జరిగిన దారుణ సంఘటనకు నిరసనగా అనకాపల్లిలో వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి గుడి జంక్షన్ లో శనివారం రాత్రి మహిళలు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ జంగాల ఫణి మాట్లాడుతూ కలకత్తాలో ఒక ట్రైనర్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం, హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమన్నారు.