ప్రతి సోమవారం అనకాపల్లి జిల్లాపోలీస్ కార్యాలయంలోనిర్వహించే"ప్రజాసమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఎం. దీపిక పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.