అజర్ బైజాన్ నుండి లే బోర్గట్ విమానాశ్రయానికి తన ప్రైవేటు జెట్‌లో వచ్చిన పావెల్‌ను ఫ్రెంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ప్లాట్ఫార్మ్ కంటెంట్ నియంత్రణ లేకపోవడం, నేర కార్యకలాపాలను అదుపు లేకుండా అనుమతించడం, సైబర్ నేరాలు, మోసం తదితర ఆరోపణలపై గతంలోనే పావెల్‌కు అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు