రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జరుగుతున్న ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి సర్వేను వీఎంసీ కమిషనర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విజయవాడ 23వ వార్డు అడ్మిన్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీలు చేస్తున్న ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి సర్వేను పరిశీలించి సూచనలు చేశారు. ప్రతి అసెస్మెంట్కు తప్పులు లేకుండా అసైన్లలో జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. కమిషనర్ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ జి.సృజన (రెవెన్యూ), డీఈ రామకృష్ణ (వాటర్ సప్లయ్), అసిస్టెంట్ కమిషనర్ బి.శ్రీనివాసరావు, రెవెన్యూ ఇనస్పెక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్ నర్మద, సచివాలయ సెక్రటరీ పాల్గొన్నారు.