నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్ ఫండ్ కింద రూ.250 కోట్లు, కేపిటల్ ఫండ్ కింద రూ.60 కోట్లు కలిపి మొత్తం రూ.310 కోట్లు కేటాయించింది. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌లో కీలకమైన నల్లమడ అటవీ ప్రాంతంలో పనులు చేపట్టాల్సి ఉన్నది. ఇందుకు ఖర్చు కూడా ఎక్కువ కానుండటంతో ఏకంగా ఈ బడ్జెట్‌లో రూ.480 కోట్లు కేటాయింపులు జరిపింది. రద్దీ మార్గాల్లో ఒకటిగా మారిన గుంటూరు - బీబీనగర్ డబ్లింగ్ కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి రూ.220 కోట్లు కేటాయించింది. విష్ణుపురం బైపాసు రైలుమార్గానికి రూ.20 కోట్లు, మోటుమర్రి - విష్ణుపురం డబ్లింగ్ ప్రాజెక్టుకి రూ.50 కోట్లు కేటాయించింది. 88 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న ఈ రైలుమార్గంలో మోటుమర్రి వద్ద రైల్ ఓవర్ రైలు బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. అలానే గుంటూరు యార్డులో మల్టీ ట్రాకింగ్ కనెక్టివిటీ పనుల నిమిత్తం మరో రూ.50 కోట్లు కేటాయించింది.