వేధింపులు తట్టులేక భర్త మర్మాంగాన్ని రెండో భార్య కోసేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రా మంలో శనివారం చోటుచేసుకుంది. సీఐ సుబ్బా రావు కథనం మేరకు.. బిహార్ రాష్ర్ఠానికి చెందిన విజయ్యాదవ్ తొర్రగుడిపాడులోని డెయిరీ ఫాం లో పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య, పిల్లలు బిహార్లో ఉంటున్నారు. రెండో భార్య సీతాకుమారితో కలిసి విజయ్యా దవ్ తొర్రగుడిపాడులో ఉంటున్నారు. సీతాకుమా రి ఆరు నెలల గర్భిణి. ఆమెను తరచూ భర్త వేధి స్తున్నాడు. ఆమె పనిచేసినందుకు వచ్చిన డ బ్బులు మొత్తం తీసుకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ప్రశ్నిస్తే కొడుతున్నాడు. పైగా మొ దటి భార్యకు డబ్బులు పంపుతున్నాడు. దీంతో కోపం పెంచుకున్న సీతాకుమారి శనివారం మ ధ్యాహ్నం మంచం మీద నిద్రిస్తున్న విజయ్యా దవ్ మర్మాంగాన్ని చాకుతో కోసేసింది. తర్వాత ర క్తం మడుగులో ఉన్న భర్తని చూసి భయపడి వి షయాన్ని డెయిరీఫాం యజమానికి ఫోన్ ద్వారా తెలిపి పారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షత గా త్రుడిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రా రంభించారు. ఫోన్ ట్రాకింగ్ ద్వారా సీతాకుమారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు స మాచారం.