ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చె ప్పారు. ఆర్టీసీ డిపోలో నూతనంగా చీరాల, హైదరాబాద్కు ఏర్పాటు చేసిన రెండు ఇంద్ర బస్సులను ఎమ్మెల్యే కొండయ్య ప్రారంబించా రు. ఈ సందర్భంగా ఆయన బస్సులో తొలి టికెట్ కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుందన్నారు. అందులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి సంబంధించిన హామీని త్వరలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారన్నారు. అందుకు అనుగుణంగా మహిళలు ఆ అవాకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో బస్ డిపో మేనేజరు శ్యామల, బస్సు డ్రైవరు, కండక్టరు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.