తాడేపల్లి గూడెం నియోజకవర్గం నిడమర్రు మండలం పెద్ద నిండ్రకొలను గ్రామానికి చెందిన బొంగా సురేష్, జోష్నా దంపతుల నెల బిడ్డకు గుండెకు రంధ్రం ఉండి అనారోగ్యానికి గురయ్యారు.వెంటనే ఆపరేషన్ చేయకుంటే బిడ్డకు ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పడంతో, ఆ తల్లిదండ్రులు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ని ఆశ్రయించారు.ఈ ఆపరేషన్‌కు సుమారు 7 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చు అవ్వగా, బొలిశెట్టి శ్రీనివాస్ మొత్తం తానే చూసుకొని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (సిమ్స్)లో బిడ్డకు చికిత్స అందించి, ప్రాణాలు కాపాడాడు.