అనంతపురానికి చెందిన వివాహితకు హైదరాబాద్ వస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని వివాహితను నమ్మించి లైంగికదాడి చేశాడు.. బాధిత మహిళ బయటకు వచ్చి ఏడుస్తుండటంతో మరో యువతి అక్కడికి వచ్చి.. తనకు కూడా అన్యాయం చేశాడని, వీడిని ఎలా నమ్మి ఇంతదూరం వచ్చావంటూ చెప్పింది. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు అతడి స్నేహితుడికి బాధితురాలి నంబర్ ఇచ్చాడు. అతడు కూడా తాను ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఫోన్ చేసి.. వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీనిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. ఈ కేసులో ఇన్స్పెక్టర్ మొదట బాధితురాలిపైనే ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చాడు. ఆమె డబ్బులు ఆశిస్తుందంటూ అధికారులకు చెప్పి.. ఆ కేసు తీవ్రతను తగ్గించాడు. ఆ తరువాత రెండు కేసుల్లో నిందితులను పిలిపించాడు. 'కేసు పెద్దదవుతోంది.. నేను ఆ అమ్మాయితో మాట్లాడుతాను.. మీరు రూ.6 లక్షలు ఇవ్వండి అంటూ సెటిల్మెంట్ చేశాడు. నిందితుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసి.. అందులో సగం బాధితురాలికి ఇచ్చి.. మిగతా సగం రూ.3 లక్షలు ఇన్స్పెక్టర్ కొట్టేశాడనే ఆరోపణలు ఉన్నాయి. పెండ్లయ్యింది.. పిల్లలున్నారు కేసులు పెట్టు కొని ఎన్నాళ్లు కొట్లాడుతావు. డబ్బులు వచ్చాయి. ఈ కేసు మర్చిపో అంటూ బాధితురాలికి ఉచిత సలహా ఇచ్చాడు. నీవు కేసు విత్ డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో ఒక పిటిషన్ వేస్తే. అటు నిందితులు సేఫ్ అవుతారు.. మేం కూడా.. నీవు కోర్టులో పిటిషన్ వేశావని కేసు క్లోజ్ చేస్తాం.. ఎవరి చేతికి మట్టి అంటకుండా అన్ని సర్దుకుంటాయి.. అంటూ ఆ ఇన్స్పెక్టర్ బాధితురాలు, నిందితుల మధ్య రాజీ కుదిర్చి సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి