కదిరి మండలం వీరేపల్లి వద్ద మద్దిలేరు వాగులో చేపల వేటకు వెళ్లిన మహారాష్ట్ర వాసి నామ్ దేవ్ (30) అనే యువకుడు నీటిలో పడి మృతి చెందాడు. గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల కోసం మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీ సోమవారం చేపల వేట కోసం వీరేపల్లి సమీపంలోని వాగులోకి వెళ్లి కాలు జారి నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తోటి కూలీల ఫిర్యాదు ఆధారంగా కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు.