12వ తరగతి బోర్డు పరీక్షలకు NCERT నివేదిక నూతన మూల్యాంకన నమూనా ప్రతిపాదించింది. విద్యార్థులు 9 నుంచి 11వ క్లాస్ వరకు వచ్చిన మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాల్లో వెయిటేజీ ఇవ్వాలని NCERT నివేదిక సూచించింది. 12వ తరగతి తుది ఫలితాల్లో గరిష్ఠంగా 9వ తరగతి నుంచి 15%, 10వ తరగతి నుంచి 20%, 11వ తరగతి నుంచి 25% మార్కులు కలపాలని పేర్కొంది. విద్యార్థుల అసెస్‌మెంట్ ను క్రెడిట్ల వారీగా లెక్కించాలని చెప్పింది.