పెనుకొండలో ఘనమైన చరిత్ర కలిగిన పురాతన కోట గోడ కూలిన ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు కోట గోడలో రాళ్లు దెబ్బతిని కిందకు పడ్డాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక వినాయక ఆలయం వద్ద కోట గోడ కూలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పురావస్తు శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.