ఏపీలో పోలింగ్ శాతం వివరాలపై తమకు అనుమానం ఉందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇవాళ సచివాలయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున , ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్ ను వైయస్ఆర్ సీపీ నేతలు కలిసి ఫారం-20 సమాచారాన్ని అప్ లోడ్ చేయలేదని ఫిర్యాదు చేశారు. ఎన్నికల వ్యవస్ధ, ఈసీ పనితీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికల శాతాన్నిపెంచుకుంటూ పోయారు, 175 నియోజకవర్గాల నుంచి ఫామ్ 20 తెప్పించుకోవాలి, కానీ ఈ రోజుకూ ఈసీ డేటా తెప్పించలేదు. దీనిపై అనేక సంస్ధలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, ఈసీని త్వరితగతిన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాం, ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా మీరు స్పందించాలని చెప్పాం అని అన్నారు.