తమిళనాడులో సినీనటుడు విజయ్ కొత్తగా ఏర్పాటుచేసిన పార్టీలోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయనతో నాకంత పెద్ద పరిచయాలు కూడా లేదు. అప్పట్లో ఆంధ్రలో సినీనటుడు చిరంజీవి పెట్టిన పార్టీలోకే వెళ్ళలేదు! మరి ఇప్పుడు విజయ్ పార్టీలోకి ఎలా వెళతాననుకొన్నారు?ఇదంతా టిడిపి వారు చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే నన్ను నేరుగా ఎదుర్కోలేక ఇలా కట్టుకధలు అల్లి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జగనన్నకు వీరవిదేయురాలైన నన్ను వేదించడం కోసమే ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలు జరిగాయంటూ టిడిపి వారు సంబందంలేని ఆరోపణలు చేస్తున్నారు. అచ్యుతాపురంలో ఫ్యాక్టరీ దుర్గటనలో చనిపోయిన 17 మంది కుటుభాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది వారికి నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్షం వహిస్తోంది. గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే బాదితులకు జగనన్న ఉన్నాడన్న బరోసా ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రాలో జగనన్న పేదలకోసం ఎన్నో సంక్షేమపధకాలు చేపట్టారు.