ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నేత బలస శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రామభద్రపురం మండల విద్యావనరుల కేంద్రం వద్ద డిమాండ్ల సాధనకై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఏప్రిల్ నుంచి జీతాలు చెల్లించలేదని కేవలం నెలకు ఇస్తున్న ఆరువేల రూపాయల కూడా సకాలంలో చెల్లించకపోతే కుటుంబ పోషణ ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.