ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాదారులకు ప్రభుత్వం వార్నింగ్ ఇస్తోంది. ప్రభుత్వ భూములు, పార్క్ స్థలాలు.. ఏవైనా ఆక్రమిస్తే తిరిగి ఇచ్చేయండి. లేదంటే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ హెచ్చరించారు. మున్సిపాలిటీల పరిధిలో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా ఇచ్చేయాలని లేదంటే ప్రభుత్వమే లాక్కుంటుందని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అడుగు ముందుకేసి ఆక్రమణదారులు కబ్జా చేసిన భూములు తిరిగి ఇవ్వకపోతే హైడ్రా తరహా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో భూకబ్జాదారుల్లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతోంది.