భారత దేశ కుబేరుల జాబితాను హురున్ అనే సంస్థ విడుదల చేసింది. దీంట్లో గౌతమ్ అదానీ మొదటి స్థానంలో నిలిచారు. రూ.11.6 లక్షల కోట్ల సంపదతో ముకేశ్ అంబానీని దాటేశారు. గతంలో మొదటి స్థానంలో ఉన్న అంబానీ రెండో స్థానానికి చేరారు. ఆ తర్వాత శివనాడార్, సైరస్ ఫ్యామిలీ ఉన్నారు. మరోవైపు ఆసియా సంపద సృష్టికి ఇంజిన్ మాదిరిగా భారత్ మారిందని పేర్కొంది.